Dr. Ambedkar University degree |PG courses Notification released|last date July 31

 అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ , పీ.జీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల 


  డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ) కోర్సులు, పీ.జీ (ఎం.ఏ/ ఎం.కాం/ ఎం.ఎస్సీ, ఎం.బీ.ఏ) కోర్సులు,  B.Lisc, M.Lisc, PG డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి అడ్మిషన్ నోటిఫికేషన్ 2022-23 విద్యా సంవత్సరానికి విడుదల అయినట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, ఫీజు, కోర్సులు తదితర వివరాలను www.braouonline.in మరియు www.braou.ac.in లో పొందొచ్చని అధికారులు వెల్లడించారు. 

      2021-22 విద్యాసంవత్సరం మొదటీ సంవత్సరంలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు రెండో సంవత్సర ట్యూషన్ ఫీజును, అంతకు ముందు చేరిన విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేక పోయిన వారు కూడా జూలై 31వ తేదీ లోపు ట్యూషన్ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలని తెలిపారు. పూర్తి సమాచారం కొరకు, ఆన్ లైన్ లో నమోదు తదితర అంశాలపై సందేహాలుంటే సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయ 

హెల్ప్ డెస్క్ నంబర్లు: 7382929570/580/590/600 లేదా 040-23680290/291/294/295 లో సంప్రదించొచ్చని  సూచించారు.

డిగ్రీ, పీజీ ఓల్డ్ బ్యాచ్ విద్యార్థులు రెండో, మూడో సంవత్సరంలో ఫీజు సకాలంలో చెల్లించలేక పోయిన వారు,  2013-14 విద్యాసంవత్సరం నుండి 2021-22 వరకు అడ్మిషన్ పొందిఉంటే TS/AP ఆన్ లైన్ లేదా క్రెడిట్ / డెబిట్ కార్డ్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించొచ్చు అని వివరించారు. ట్యూషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేది జూలై 31.               

Post a Comment

0 Comments