Andhra Pradesh Inter advance supplementary Exams on August| fee last date July 8, 2022

 *ఆగష్టు నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ..* Andhra Pradesh 


*ఫీజు చెల్లింపునకు ఆఖరి తేదీ జులై 8..*


*ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఇంటర్ మీడియెట్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం. 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతా యని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 3న సెకండ్ లాంగ్వేజ్, 4న ఇంగ్లీసు, 5న మాథ్స్ 1ఎ, 2ఎ, బోటనీ, సివిక్స్, 6న మాథ్స్ 1బి, 2బి, జువాలజీ, హిస్టరీ, 8న ఫిజిక్స్, ఎకనామిక్స్, 10న కెమిస్ట్రీ కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్, 11న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జికోర్స్ మాథ్స్ (బీపీసీ విద్యార్థులకు), 12న మోడరన్ లాంగ్వేజ్, జాగ్రఫీ పరీక్షలు నిర్వహించనున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని 19వ తేదీ మినహా ఆగస్టు 17 నుంచి 22వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎథిక్స్, మాన విలువలపై 24వ తేదీ ఒకేరోజు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించను న్నారు. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ 26న నిర్వహిస్తారు.*


ఫీజు వివరాలు....


*ఇంటర్ మొదటి సంవత్సరం ఫీజు వివరాలను శేషగిరిబాబు వెల్లడించారు. అప్లికేషన్ రూ.10, సాధారణ కోర్సులకు రూ.500, వొకేషనల్ కోర్సులకు రూ.700, బ్రిడ్జికోర్స్ సబ్జెక్టులకు రూ.145. వొకేషనల్ బ్యాక్లాగ్స్ రూ.200, బ్రిడ్జికోర్స్ మాథ్స్(బైసీపీ విద్యార్థులకు రూ.145 ఫీజుగా నిర్ణయించారు. ద్వితీయ సంవత్సరానికి అప్లికేషన్ రూ.10, సాధారణ కోర్సులకు రూ.700, మొదటి, రెండు సంవత్సరాల్లో ఏదైనా ఒక సంవత్సరానికి రూ.500, రెండు సంవత్సరాల పరీక్షలు రాసే విద్యార్థులు రూ.1200, వొకేషనల్ రూ.700, జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్స్ రూ.200, ద్వితీయ సంవత్సరం రాసే విద్యార్థులకు ప్రాక్టికల్ ఫీజు రూ.200, ఒకేషనల్ బ్రిడ్జికోర్స్ రూ.145, రెండు సంవత్సరాల సబ్జెక్టులకు రూ.290, రెండు సంవత్సరాల ఒకేషనల్ ప్రాక్టికల్స్ కు రూ.400, బ్రిడ్జికోర్స్ ప్రాక్టికల్స్ రూ.200, బ్రిడ్జికోర్స్ మాథ్స్(బైపీసీ విద్యార్థులకు) మొదటి, రెండు సంవత్సరాలకు రూ.290, ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంప్రీవ్మెంట్ పరీక్ష రాసిన పక్షంలో ఆర్ట్స్ సబ్జెక్టులకు రూ.1200, సైన్స్ విద్యార్థులు రూ.1400 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. మొదటి, రెండు సంవత్సరాల ఫీజు చెల్లించేందుకు జూలై 8 ఆఖరి తేదిగా పేర్కొన్నారు. ఆన్లైన్ ఫీజు చెల్లింపులకు అవకాశం ఇచ్చినట్లు శేషగిరిబాబు తెలిపారు.*

Post a Comment

0 Comments