Sarkari vari pata rap song released.. Aacharya OTT release date fix...'అలా అయితేనే పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తా' - శివకార్తికేయన్

# 'సర్కారు వారి పాట' నుంచి ర్యాప్ సాంగ్#


'సర్కారు వారి పాట' సినిమా నుంచి మహేశ్

అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ వచ్చింది.

సినిమాలో ఫైట్ సీన్లు, మహేశ్ ఆటిట్యూడను చూపిస్తూ

ఓ ర్యాప్ సాంగ్ విడుదల చేశారు. 'సర్కారు వారి వేట..

పవర్ ఫుల్ మాట, రివర్స్ లేని బాట' అంటూ సాగే ఈ

సాంగ్ ఆకట్టుకుంటోంది.


ఆచార్య ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్


మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ తేజ్ నటించిన ఆచార్య

సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. మే 20న

అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదల కానుంది.

కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్

29న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద

డిజాస్టర్ గా మిగిలింది. అటు RRR కూడా మే 20న

ఓటీటీ ఫ్లామ్ Zee5లో రిలీజ్ కానుంది. రెండు

పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. మీరు

ఏ సినిమా చూస్తారు మరి...!


'అలా అయితేనే పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తా'


పాన్ ఇండియా మూవీలపై హీరో శివకార్తికేయన్

స్పందించాడు. ఐడియా కొత్తగా ఉంటేనే పాన్

ఇండియా మూవీల్లో నటించడానికి తాను

సిద్ధమన్నాడు. ఇవాళ రిలీజ్ అయిన డాన్ మూవీ

కుటుంబ సమేతంగా చూసి ఆనందించే విధంగా

ఉంటుందని అన్నాడు. దర్శకుడు కథ చెప్పగానే కాలేజీ

రోజులు గుర్తుకు రావడంతో వెంటనే నటించడానికి ఒకే

చెప్పానన్నాడు.



Tags

Post a Comment

0 Comments