వరుడి, మెడలో వధువు తాళికట్టే సన్నివేశం...ఏపీలోని శ్రీకాకుళంలో చోటు చేసుకుంది.....

 వరుడి, మెడలో వధువు తాళికట్టే సన్నివేశం...ఏపీలోని శ్రీకాకుళంలో చోటు చేసుకుంది.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో ఉన్న నువ్వలరేవు గ్రామానికి వందల సంవత్సరాల క్రితం ఒడిశా

నుంచి కేవిటీ కులస్తులు వలస వచ్చారు. వీరంతా చేపల వేటపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. వివాహం విషయంలో వీరి పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం ప్రకారం వీరు మూడేళ్లకోసారి ఆ గ్రామంలో సామూహిక వివాహాలు నిర్వహిస్తుంటారు.

ఆ ముహూర్తంలో గ్రామంలో ఒకరిని ఒకరు ఇష్టపడి, ఇరు కుటుంబాలు అంగీకరించి, పెళ్ళికి సిద్ధంగా ఉన్న యువతీ

యువకులకు పెళ్ళి చేస్తారు. మూడు సంవత్సరాలకొకసారి తప్ప మిగిలిన సమయంలో ఆ గ్రామంలో పెళ్ళి అనే మాట వినపడదు. ఆ గ్రామంలో ఉండే వారు గ్రామంలో వాళ్ళని మాత్రమే పెళ్ళి చేసుకోవాలి. అది కూడా వారి ఆచార వ్యవహారాలు, వారి సాంప్రదాయం ప్రకారమే అంతా జరగాలి. సాధారణ పెళ్ళిళ్ళతో పోలిస్తే వీరి సాంప్రదాయ వివాహాలు కొత్తగా అనిపిస్తాయి. పందిళ్లు వేయటం, రంగులు అలంకరించటం, పెళ్లి పిలుపులు వంటివి కొన్ని కామన్ గా ఉంటాయి. కానీ తాళి కట్టే సమయంలో మాత్రం భిన్నంగా ఉంటుంది వీరి సాంప్రదాయం. సాధారణంగా మనం చూసే పెళ్ళిళ్ళలో వరుడు మాత్రమే వధువుకు తాళి కడతాడు. వీరి సాంప్రదాయం ప్రకారం మాత్రం వరుడు, వధువుకు తాళి కట్టడంతో పాటు ధాన్యపు గింజ ఆకారంలో ఉండే ధాన్యరచన అనే ఆభరణం వంటి తాళిని వధువు కూడా వరుడికి కడుతుంది. ఈ ధాన్యరచనను పెళ్ళయిన మూడు నెలలలోపు మరల ఆ ఆభరాణాన్ని కరిగించి వధువు మంగళ సూత్రాల్లో దాన్ని కలిపి ధరిస్తారు. నిన్న జరిగిన సామూహిక వివాహాల్లో కూడా వధువులు వరుడికి తాళి కట్టటంతో ఈ వార్త వైరల్ అవుతోంది.

Tags

Post a Comment

0 Comments