మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానున్న చంద్రబాబు దీక్ష...నేడు, రేపు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు....


*అమరావతి:...*                           తాజా వార్తలు....


  • మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానున్న చంద్రబాబు దీక్ష...


  ఉండవల్లి నివాసం నుంచి బయలు దేరిన చంద్రబాబు...


 పార్టీ కార్యాలయం పై దాడికి నిరసనగా చంద్రబాబు దీక్ష...


  పగిలిన అద్దాలు, ధ్వంసమైన ఫర్నిచర్ మధ్య దీక్షా వేదిక       ఏర్పాటు...


   టిడిపి కార్యాలయంలో మూడు రోజుల్లో 36 గంటలు దీక్ష చేయుటకు ఏర్పాట్లు పూర్తి...


వివిధ జిల్లాల నుంచి దీక్షకు భారీగా చేరుకుంటున్న టీడీపీ నేతలు...


*నేడు, రేపు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు*


ఏపీలో నైరుతి నిష్క్రమణం ప్రారంభం


ఈ నెల 26తో పూర్తిగా ఉపసంహరణ


 విశాఖపట్నం: ఈశాన్య గాలుల ప్రభావం, తేమ గాలులు వీస్తుండడం వల్ల నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో  తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 


ఇదిలా ఉండగా..రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల నిష్క్రమణం క్రమంగా ప్రారంభమయ్యింది.ఈ నెల 23 నాటికి సగానికిపైగా ప్రాంతాల నుంచి, 26న పూర్తిగా నైరుతి ఉపసంహరణ ఉంటుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదే సమయంలో 26వ తేదీన ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


 కాగా, గడచిన 24 గంటల్లో  రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి.

Tags

Post a Comment

0 Comments