ఏపీ లాసెట్ పరీక్ష ఫలితాలు....విజయవాడకు చెందిన మోపురు హరిప్రియ మొదటి ర్యాంకు....గుంటూరుకు చెందిన లీలా రాజా సెకండ్‌ ర్యాంక్‌..


తాజా వార్తలు....                              Breaking News.....


  • ఏపీ లాసెట్ పరీక్ష ఫలితాలు గురువారం విడదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రరెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. 

  • న్యాయ కళాశాలల్లో మూడు, ఐదేళ్ల న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. 

  • మూడేళ్ల లా కోర్సులో 92.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఐదేళ్ల లా కోర్సులో 1,991 మంది ఉత్తీర్ణులయ్యారని  ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తెలిపారు.

  • కాగా మూడేళ్ల లా కోర్సులో విజయవాడకు చెందిన మోపురు హరిప్రియ మొదటి ర్యాంకు సాధించారు. 

  • గుంటూరుకు చెందిన లీలా రాజా సెకండ్‌ ర్యాంక్‌.. కందలగడ్డ హరికృష్ణ మూడో ర్యాంకు సాధించారు. 

  • చీరాలకు చెందిన గొర్ల హారిబాబు,  అనంతపురానికి చెందిన సాతర్ల మంజునాధ 4, 5 ర్యాంకులు సాధించారు.

Tags

Post a Comment

0 Comments