ఏరియల్​ సర్వే నిర్వహిస్తున్న అమిత్​ షా....రాష్ట్రంలో ప్రస్తుతం 17 ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు, 7 ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాలు, 15 పీఏసీ బృందాలు 5000....





  • ఏరియల్​ సర్వే నిర్వహిస్తున్న అమిత్​ షా

         

  • ఉత్తరాఖండ్: ప్రభుత్వం అప్రమత్తమై తగిన చర్యలు చేపడుతుండటం ద్వారా ఉత్తరాఖండ్​లో వరదల కారణంగా వాటిల్లే నష్టాన్ని కట్టడి చేయగలిగామని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. 

  • రాష్ట్రంలో భారీ వర్షాలకు ఇప్పటివరకు 64 మంది ప్రాణాలు కోల్పోగా, 11 మంది గల్లంతయ్యారని వెల్లడించారు. 

  • రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్​ సర్వే నిర్వహించిన సందర్భంగా షా ఈ వ్యాఖ్యలు చేశారు.

  • మొబైల్​ నెట్​వర్క్​ను 80 శాతం వరకు పునరుద్ధరించామని, నైనితాల్​, అల్మోరా, హల్దానీలలో రోడ్డు మార్గాన్ని కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు అమిత్​ షా. 

          

  • తప్పిపోయిన రెండు ట్రెక్కింగ్​ బృందాల్లో ఒక బృందం ఆచూకీ ఇప్పటికే కనుగొన్నామని తెలిపారు. 

  • 3500 మందికిపైగా వరద బాధితులను రక్షించామని.. 16వేలకుపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. 

  • పర్యటకులు కూడా సురక్షితంగానే ఉన్నట్లు తెలిపారు.

  • రాష్ట్రంలో ప్రస్తుతం 17 ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు, 7 ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాలు, 15 పీఏసీ బృందాలు సహా 5000 మంది పోలీసులను అత్యవసర సేవలకు అందుబాటులో ఉంచినట్లు షా స్పష్టం చేశారు.

  • ఏరియల్​ సర్వేలో అమిత్​ షాతో పాటు ముఖ్యమంత్రి పుష్కర్​ సింగ్​ ధామి, గవర్నర్​ గురుమిత్​ సింగ్, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజామ్​ భట్​, విపత్తు నిర్వహణ శాఖ సహాయ మంత్రి ధన్​ సింగ్​ రావత్​లు కూడా పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments