You Know - 1


   You Know - 1    22.09.2021

      🍁మీకు తెలుసా?🍁

  • గాఢనిద్రలో ఉన్నప్పుడు మనకు వాసన తెలియదు.

  • కాలిగోళ్లకన్నా చేతిగోళ్లు నాలుగు రెట్లు వేగంగా పెరుగుతాయి.

  • ప్రేమలో పడడమంటే భయపడటాన్ని ఫైలోఫోబియా అంటారు.

  • కప్పలగుంపును ‘ఆర్మీ’ అంటారు.

  • అంతరిక్షంలో పక్షులు బతకలేవు. ఆహారం మింగడానికి వాటికి గురుత్వాకర్షణ శక్తి అవసరం.

  • ముక్కు మూసుకుని కూనిరాగాలు తీయలేం.

  • 2019లో బంగ్లాదేశ్‌లో - రెండు గర్భాశయాలున్న ఒక మహిళకు ఒక గర్భసంచిలోని బిడ్డ జన్మించిన నెల తరువాత రెండో గర్భసంచిలోని కవలలు పుట్టారు. ఇలాంటి సంఘటన ప్రపంచంలో అదే ప్రథమమట.

  • ఫ్లెమింగోల గుడ్లలోపలి సొన గులాబీరంగులో ఉంటుంది.

  • కారంగా ఉండే ఆహారాన్ని తినే ఏకైక జీవి మనిషి

  • మనకు మనమే కితకితలు పెట్టుకోవడం అసాధ్యం.

  • కొత్త పెన్ను కొనేటప్పుడు బాగా రాస్తుందో లేదో చూడాలంటే- నూటికి 97 మంది తమ పేరే రాస్తారట.

  • చల్లని నీళ్ల కంటే వేడినీరు త్వరగా గడ్డకడుతుంది.

  • మనిషి శరీరంలో అన్నిటికన్నా బలమైన కండరం ‘నాలుక’.

  • మైక్రోవేవ్‌ ఒవెన్‌లో పెడితే ద్రాక్షపండ్లు పేలిపోతాయి.

  •  ఎలుకలు వాంతి చేసుకోలేవు. కాబట్టే ఎలుకల మందు వాటిపై బాగా పనిచేస్తుంది.

  • సముద్రాల సగటు లోతు రెండు మైళ్లు.

  • గోడ గడియారంలో గంటలముల్లు వేగం గంటకు 0.00000275 మైళ్లు.

  • పూర్తిగా పెరిగిన అరటిగెల బరువు సగటున 11 కిలోల దాకా ఉంటుంది.

  • సింహం అరుపును ఐదుమైళ్ల దూరం నుంచి కూడా వినవచ్చు.

  • ఆపిల్‌ పండ్లలో మూడోవంతు గాలి ఉంటుంది. అందుకే అవి నీళ్లలో తేలతాయి.

  • లూసియానాలో గులాబీరంగు డాల్ఫిన్‌ ఉంది. దాన్ని పింకీ అని పిలుస్తారు. జన్యుపరమైన కారణాల వల్ల ఆ వర్ణం సంక్ర మించిందట.

  • ఏడవడం వల్ల శరీరంలో- నొప్పిని తగ్గించే ఎండార్ఫిన్లూ ఆనందానికి దోహదపడే ఆక్సిటోసిన్‌ విడుదలవుతాయి. అందువల్లనే, ఏడ్చినప్పుడు (ఒత్తిడీ ఉద్వేగం తగ్గి) మనసుకు కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది.

  • చంద్రుడి మీద మానవుడి తొలి అడుగుజాడలు దాదాపు 5 లక్షల సంవత్సరాలు నిలిచి ఉంటాయి.

  • ఒలింపిక్స్‌ జెండాలో- తెలుపుమీద ఐదురంగుల వృత్తాలుంటాయి. ప్రతి దేశపు జెండాలోనూ ఈ ఆరురంగుల్లో కనీసం ఏదో ఒకటి తప్పక ఉంటుంది.

  • ప్రపంచ దేశాలన్నింటిలోనూ టూరిస్టులు ఎక్కువగా వేళ్లే దేశం ఫ్రాన్స్‌.🍁


Tags

Post a Comment

0 Comments