Let's find out - 2 పశువులు రంగులు చూస్తాయా❓

 


   Let's find out - 2


  🍁తెలుసుకుందాం🍁


1. 🐂పశువులు రంగులు చూస్తాయా❓


🌸జవాబు: పశువులు రంగుల్ని చూడలేవనేది నిజమే. రంగులంటే మనం చూసే సప్తవర్ణాలు, వాటి కలయికల వల్ల ఏర్పడే ఫలిత వర్ణాలే. తెలుపు, నలుపుల్ని కూడా మనం రంగులంటాం. కానీ అవి నిజానికి రంగులు కావు. ఇక పశువులు కేవలం నలుపు, తెలుపు ఛాయల్ని మాత్రమే చూడగలుగుతాయి. సినిమాల్లో ఎర్ర చీర కట్టుకున్న హీరోయిన్‌ను ఎద్దు తరిమినట్టు చూపించే దృశ్యాలన్నీ నాటకీయత కోసమే. ఎర్ర చీరయినా, పసుపు చీరయినా, ఆకుపచ్చ చీరైనా పశువులకు బూడిద (గ్రే) రంగులో మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి నల్లటి దుస్తులు పశువులకు స్పష్టంగా కనిపిస్తాయి.



2. భారత ప్రామాణిక కాలమానం (Indian Standard


Time)ని 1947 SEP 1 నుంచే పాటించడం మొదలుపెట్టారు. ఇది గ్రీన్విచ్ సమయానికి ఐదున్నర గంటలు(UTC+5:30) ముందు ఉంటుంది. ISTని 82.5° తూర్పు రేఖాంశం ఆధారంగా లెక్కిస్తారు. ఈ రేఖాంశం UP-అలహాబాద్ సమీపంలోని మీర్జాపూర్కు పశ్చిమంగా.. ఏపీలోని కాకినాడ మీదుగా వెళుతుంది. సైనిక, విమానయాన సమయంలో ISTని 'ఏకో స్టార్(E*)'గా సూచిస్తారు.


AM: యాంటీ మెరీడియన్, PM: పోస్ట్ మెరీడియన్

Tags

Post a Comment

0 Comments