Let's find out - 1 గోరింటాకు ఎలా పండుతుంది

 


       Let's find out - 1


🍁తెలుసుకుందాం🍁


🍂గోరింటాకు ఎలా పండుతుంది❓


🌸జవాబు: తోరింటాకు అరచేతులు , అరికాళ్ల మీద పండినంత ఎర్రగా మిగిలిన శరీర భాగాలమీద పండకపోవడం గమనించే ఉంటారు. అసలు ఈ ఆకుల వల్ల మన చర్మం మీద ఎర్రగా ఎలా పండుతుంది అనుకుంటున్నారా?



ఆకులోని లాసోన్ అనే పదార్థం చర్మంలోని స్త్రామ్ కార్నియం పొరలోని మృతకణాల ద్వారా లోపలకు ఇంకి చర్మానికి ఎరుపు రంగునిస్తుంది. లాసిన్‌తో పాటు మేనైట్ యాసిడ్, మ్యుసిలేజ్, గాలిక్ యాసిడ్, నాఫ్టాక్వినొన్ లాంటి రసాయనాలు కూడా ఇందులో ఉండటం వల్ల ఇది మంచి కలర్ డైగా వాడుకలో ఉంది. మన శరీరము వెలుపల ఉండే కెరోటిన్‌ కి అంటుకునే గుణము ఈ గోరింటాకుకు ఉంది. మన శరీరంలోని వెంట్రుకలు, గోళ్లు, అరచేతులు, అరికాళ్లు వంటి భాగాలలో కెరోటిన్‌ ప్రోటీన్‌ అధికం. అందుకే ఆ భాగాలలో బాగా పట్టి పండుతుంది. 






👉 గోరింటాకు రంగు మార్చాలంటే దానిలో కాఫీపొడి లేదా టీ డికాక్షన్‌ వంటివి కలుపుతారు. మన శరీరంలో చర్మంలోని కెరోటిన్‌తోనే గోరింటాకు రియాక్ట్ అవడం వల్ల... కాలంతో కెరటిన్‌ మృతకణాలు రాలిపోతాయి. దానితో పాటే గోరింటాకు రంగూ పోతుంది. అందుకే గోరింటాకు పెట్టుకున్న తరువాత కొద్దిరోజులే ఆ రంగు ఉంటుంది.






గోరింటాకులో లాసిన్‌, మేనైట్ యాసిడ్, మ్యుసిలేజ్, గాలిక్ యాసిడ్, నాఫ్టాక్వినొన్ లాంటి రసాయనాలు ఇందులో వుంటాయి.

Tags

Post a Comment

0 Comments